బైరెడ్డి సిద్దార్థరెడ్డి పంతం నెగ్గించుకుంటారా.?

547చూసినవారు
బైరెడ్డి సిద్దార్థరెడ్డి పంతం నెగ్గించుకుంటారా.?
రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున యువ నేతల్లో ఎక్కువగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం నందికొట్కూరు వైసీపీ ఇన్ ఛార్జ్ గా బైరెడ్డి కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అర్థర్ కు బైరెడ్డికి విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల మార్పు కొనసాగుతోంది. ఈ క్రమంలో బైరెడ్డి సోమవారం అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లారు. దీంతో బైరెడ్డి సూచన మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు ఉండనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని బైరెడ్డి సిఫారసును జగన్ ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి.!

సంబంధిత పోస్ట్