VIDEO: నోటితో శ్వాస అందించి బ్రతికించింది

223182చూసినవారు
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ మహిళా పోలీసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. షాపింగ్ కోసం వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే మహిళా కానిస్టేబుల్ కేకే ధోలియా ఆమె వద్దకు వెళ్లింది. CPR చేయడంతో పాటు ఆమెకు నోటితో శ్వాస అందించింది. కాసేపటికి బాధిత మహిళ కోలుకుంది. ఆమె ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్