మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు (వీడియో)

148688చూసినవారు
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సర్వాడి గ్రామంలో తాజాగా దారుణం జరిగింది. ఓ మహిళ(32)ను కొందరు మహిళలు అర్ధనగ్నంగా ఊరేగించారు. ఆమె తన భర్తతో ఎఫైర్ పెట్టుకుందని ఓ మహిళ అనుమానించింది. తన బంధువులతో కలిసి బాధితురాలిని కొట్టింది. ఆమె దుస్తులు చింపి రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఈ దారుణాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఈ వీడియో వైరల్ అయ్యాక పోలీసులు స్పందించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్