బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఏటీఎంలలో నగదు నింపుతుంటాడు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి రెండున్నర కోట్ల నగదు తీసుకుని పరారయ్యాడు. విషయం తెలిసి బ్యాంకు అధికారులు అశోక్ కుమార్‌పై రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టిస్తే భారీగా బహుమతి ఇస్తామని తూ.గో. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రకటన విడుదల చేశారు.