అద్దంకి నియోజకవర్గం లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు మంగళవారం అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల వద్ద కూడా సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని హేబేలు ఆరోపించారు.