రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత వైద్యం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయ కర్త హేబేలు ఆదివారం అద్దంకి మండలం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. రాష్ట్రంలో వైద్యం పేదవానికి అందని ద్రాక్షాల మారిందని అన్నారు. ప్రైవేట్ వైద్యశాలలో కూడా ప్రజలందరికీ ఉచిత వైద్యం అందే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.