తిమ్మన్నపాలెం: మద్యం దుకాణం నిర్మాణాన్నిఅడ్డుకున్న మహిళలు

84చూసినవారు
తిమ్మన్నపాలెం: మద్యం దుకాణం నిర్మాణాన్నిఅడ్డుకున్న మహిళలు
కొరిశపాడు తిమ్మన్నపాలెం గ్రామం, ఎస్సీ కాలనీ నందు మద్యం దుకాణం నిర్మాణాన్ని కాలనీవాసులు మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 10 ల సంఖ్యలో మహిళలు రహదారి పైకి చేరుకుని, తమ చర్చి ఎదురుగా మద్యం దుకాణాన్ని నిర్మించటానికి వీలు లేదు అని నిరసన వ్యక్తం చేశారు. నివాస సముదాయం దగ్గరలో వైన్ షాప్ నిర్మాణం వలన మహిళలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరేచోట నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్