అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా స్థాయిలో మంగళవారం సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో రెండు విభాగాల్లో ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. వ్యాసరచన పోటీలలో 8వ తరగతి విద్యార్థిని తేజస్వి తృతీయ స్థానం, డ్రాయింగ్ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని మణి చందన ద్వితీయ స్థానం సాధించినట్లు హెచ్ఎం హనోరా చెప్పారు.