కార్టీక మాసం సందర్భంగా శివభక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ పంచారామ శైవ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతిలను దర్శించుకోవటానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ నుంచి చిలకలూరిపేట డిపో నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు.