చిలకలూరిపేట పట్టణంలో చౌత్రా సెంటర్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లే మార్గంలో టిక్ టాక్ బజార్ ఎదురు గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ లో ఆంజనేయస్వామి విగ్రహన్ని తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన విగ్రహం పడిపోయింది. ఘటనలో రోడ్డు పక్కన ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.