చిలకలూరిపేట నియోజకవర్గంలో మినీ గోకులాలను కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. నాదెండ్ల మండలం తూబాడు, సాతులూరు గ్రామాల్లో వీటిని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ. గోకులాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.