చిలకలూరిపేట పట్టణంలో 3 అన్న క్యాంటీన్ లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆయన పేదలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.