పల్నాడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 34 ఫిర్యాదులు

73చూసినవారు
పల్నాడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 34 ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 34 వినతులను స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మంది అర్జీదారులు తమ వినతులను జిల్లాజాయింట్ కలెక్టర్ సూరజ్, ఇతర అధికారులకు అందించారు.

సంబంధిత పోస్ట్