విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని కళ్యాణి సెంటర్, సుబ్బయ్యతోట, బోస్ రోడ్డు, కేబీ రోడ్డు, విజయబ్యాంకు పరిసర ప్రాంతాలలో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.