నాదెండ్ల మండల పరిధిలోని అమీన్ సాహెబ్ పాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు భూపతిగా గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది