స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం జిల్లా కలెక్టర్ ఆనవాయితీగా ఇచ్చే హై టీ కార్యక్రమం గురువారం బాపట్లలో జరిగింది. జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల, బాపట్ల ఎమ్మెల్యేలు మాలకొండయ్య, నరేంద్రవర్మ, జిల్లాస్థాయి అధికారులు హాజరుకాగా జె. సి సుబ్బారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.