ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం
అర్ధవీడు మండలం వెలగలపాయ అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపి తిన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని మృతి చెందిన ఆవుని అధికారులు పరిశీలించారు. పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. మృతి చెందిన ఆవు విలువ రూ. 80 వేలు ఉంటుందని రైతు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపాడు.