గిద్దలూరు మండలం దిగువమెట్టలో మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బుధవారం స్థానిక అర్బన్ సీఐ సురేష్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుంటే ప్రజలు 100 నంబర్ కి సమాచారం అందించాలన్నారు.