ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మంగళవారం తప్పిపోయి తిరుగుతున్న ఓ బాలుడిని స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సోషల్ మీడియా ఆధారంగా పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఆ బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ సురేష్ బాలుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అసలే రోజులు బాగోలేదని తల్లితండ్రులకు హితబోధ చేశారు.