దశలవారీగా రోడ్లు, డ్రైన్ల పై ఆక్రమణలు తొలగించాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఆక్రమణలు పునరావృతం కాకుండా సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, టిపిబిఓలు భాధ్యత తీసుకోవాలన్నారు. కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరంలో జరుగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇచ్చిన షార్ట్ ఫాల్స్ పై నవంబర్ 15లోపు నోటీసులు ఇవ్వాలన్నారు.