గుంటూరు: కార్తీకదీప కాంతులతో శోభిల్లిన శైవ క్షేత్రాలు

78చూసినవారు
పవిత్ర కార్తీక మాసంలో 2వ సోమవారం వేడుకలు గుంటూరు నగరంలో అట్టహాసంగా జరిగాయి. నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీప కాంతులతో ఆలయాలు కళకళలాడాయి. భక్తులు దైవదర్శన గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పవిత్ర కార్తీక మాసంలో దైవదర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్పారు.

సంబంధిత పోస్ట్