గుంటూరులోని సెల్ ఫోన్ షోరూంలో చోరీ

60చూసినవారు
గుంటూరులోని సెల్ ఫోన్ షోరూంలో చోరీ
సెల్ ఫోన్ షోరూంలో చోరీ జరిగిన ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 60 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ సెల్ ఫోన్ షోరూమ్ షట్టర్ తాళాలు పగలగొట్టి అందులోని లాప్టాప్, కంప్యూటర్, చార్జర్లు చోరీ చేశారు. దీంతో దుకాణ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్