గుంటూరు: విద్యుత్ వైర్ బాక్సులు చోరీ పై కేసు నమోదు

73చూసినవారు
గుంటూరు: విద్యుత్ వైర్ బాక్సులు చోరీ పై కేసు నమోదు
గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్ లో గల పద్మిని కృష్ణ కల్యాణ మండపం సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ విద్యుత్ వైర్ల బాక్సుల చోరీ జరిగింది. రూ. లక్ష ఖరీదైన వంద బాక్సులను దుండగులు అపహరించుకుపోయారు. ఈ నెల 8 రాత్రి ఈ చోరీ జరిగింది. మంగళవారం మండపం నిర్వాహకుడు కోట వెంకట హరీష్ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్