గుంటూరు: ఈనెల 11న ధర్నా జయప్రదం చేయండి: సత్యన్నారాయణ

82చూసినవారు
ఈ నెల 11న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యన్నారాయణ వెల్లడించారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సత్యన్నారాయణ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్