డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగరంపాలెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం అటవీ అమరవీరుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ని ఎమ్మెల్యే మాధవి కలిసి పుష్పగుచ్ఛాన్ని బహుకరించారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం రావడం సంతోషంగా ఉందని అన్నారు.