మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలోని ఎస్సీ కాలనీలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం బారిన పడిన వారిని గుర్తించి వెంటనే వారిని వైద్య శాలకు తరలించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. పంచాయతీ అధికారులు మురికి కాలువపై బ్లీచింగ్ పౌడర్ చల్లి, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.