పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కే. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు డీఎస్పీ నాగేశ్వరరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్. ఐలు, పీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు పోలీస్ అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో సరదాగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.