ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చరిత్రలో లేని విధంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా నిధులు పెంచిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ వల్ల సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని, ఈ వర్గాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. ప్రభుత్వ నిబద్ధత పేదల సంక్షేమానికి అంకితమై ఉందని ఆయన తెలిపారు.