దాచేపల్లిలో పెరుగుతున్న డయేరియా కేసులు.. కాలనీవాసుల ఆందోళన

52చూసినవారు
దాచేపల్లిలోని అంజనీపురం కాలనీలో డయేరియా కేసులు పెరుగుతూ ఉండడంతో ఆందోళనకు గురవుతున్నామని శుక్రవారం కాలనీ వాసులు అన్నారు. ప్రతి ఇంటిలో విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. సరైన డ్రైనేజీ సిస్టం లేకపోవడం వలన మంచినీరు కలుషితమై వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తప్పితే అధికారులు తమ కాలనీ మొహం కూడా చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్