జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన 94, 512 కుళాయి కనెక్షన్లు గానూ ఫిబ్రవరి 2025 నాటికి 46, 316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం నరసరావుపేట స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.