భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర బిజెపి హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం పిడుగురాళ్ల లోని పిల్లుట్ల రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.