మాచవరం జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలోని పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాస ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేశారు. గ్రామాల్లో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని మహిళలు అమ్మవారిని మొక్కుకున్నారు. అనంతరం పొంగళ్లు పెట్టి నైవేద్యంగా సమర్పించారు.