మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురయింది. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్ పై దాడి, కారంపూడి సీఐపై దాడి అభియోగాలతో పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా, రెండు కేసుల్లోనూ జడ్జి బెయిల్ నిరాకరించారు. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.