కారంపూడి పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈఓ కొల్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండి చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్ట్రాలు సమర్పించి పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.