మాచర్ల నియోజకవర్గంలో ప్రతి నలుగురిలోనూ ఒకరు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుని ఉండేలా ఆ విధంగా లక్ష్యాలను ఏర్పరచుకొని ప్రతి కార్యకర్త పనిచేయాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.