సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే

50చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఓ ప్రకటనలో బుధవారం మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో, వార్డులలో పర్యటిస్తున్నారని ఆరోగ్య సిబ్బంది ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీరు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్