ఈతకి వెళ్లి కాలువలో పడి గల్లంతైన విద్యార్థి శుక్రవారం శవమై తేలాడు. మండలంలోని జెట్టిపాలెం గ్రామానికి చెందిన తాటిమళ్ళ కోటేశ్వరరావు(14) రెంటచింతల లోని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 18వ తేదీన మాచర్ల సమీపంలో నివాసముంటున్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సమీపంలోని బొంబాయి కంపెనీ కాలువ వద్దకు ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రవాహ ఉధృతిలో గల్లంతయ్యాడు.