యువతి ఆదృశ్యమైన సంఘటన రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మంచికల్లు గ్రామానికి చెందిన ఆరే పిచ్చయ్యకు తెలంగాణ రాష్ట్రం దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన సునీత(19)తో గత నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. బ్యాంకు పనుల నిమిత్తం ఈనెల 18వ తేదీన రెంటచింతల వెళ్ళి తిరిగి వస్తానని ఇంటి వారికి చెప్పి బయలుదేరిన సునీత ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది.