కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బోసు సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ బొమ్మ సెంటర్, తాడేపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం, సాయిబాబా గుడి, తహశీల్దార్ కార్యాలయం, నులకపేట, ప్రకాష్ నగర్, సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల పోరాట శిబిరం వరకు సాగింది.