తాడేపల్లి: కరపత్రాలు పంపణీ చేసిన సిపిఎం నాయకులు

77చూసినవారు
తాడేపల్లి: కరపత్రాలు పంపణీ చేసిన సిపిఎం నాయకులు
పెరుగుతున్న అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్