తాడేపల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

52చూసినవారు
తాడేపల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను మంగళగిరి ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ వీరాంజనేయులు మాట్లాడుతూ అనధికారికంగా మద్యం విక్రయాలు జరుపుతున్న రమణమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనధికార మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్