నరసరావుపేట పట్టణంలో మంచినీటి సరఫరా చేయు ప్రధాన పైపు మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రవిచంద్రరెడ్డి తెలిపారు. పట్టణంలోని 1, 34, 10, 11, 12, 13, 14, 17, 18, 19 , కాలనీ, గ్యాస్ గోడౌను విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండదని తెలియజేశారు. రేపు సాయంత్రం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అన్నారు. ప్రజల సహకరించాలని కోరారు.