పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా గొట్టిపాటి రవి కుమార్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 26 జిల్లాలకు నూతన ఇన్ఛార్జుల మంత్రులను నియమించింది. అందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను నియమించడం జరిగింది. దీంతో పల్నాడు ప్రజలు, నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.