సమస్య అంటూ వచ్చిన పౌరుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన 'మీ కోసం'కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో నూతన ఒరవడిని సృష్టిద్దామని, గ్రీవెన్స్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే పరిష్కారంతోనే ఇంటికి వెళ్తామనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. అర్జీదారులకు భోజనం, తాగునీరు, మజ్జిగ సదుపాయాలు కల్పిస్తామన్నారు.