వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నాబార్డు ద్వారా అమలు చేసే ప్రాజెక్టులపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. ప్రతి సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమయంలో తప్పనిసరిగా అవగాహన కార్యక్రమం ఉండేలా చూడాలన్నారు. నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ లో నాబార్డు ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు.