ఈ నెల19న నరసరావుపేట, అశ్వకుల్ల ఖాన్ కాలనీలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో జరగనున్న కామ్రేడ్ అశ్వకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ ల 97వ సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం నరసరావుపేట బస్టాండ్ సెంటర్ సంబంధిత కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.