పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్. వి నరసింహారావు సంస్మరణ సభను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నరసరావుపేట మార్కెట్ సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈనెల 28న గుంటూరు కొరటాల భవన్ సిపిఎం పార్టీ కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.