పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు 43 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి అర్జీలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.