ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నాలుగో శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లాలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.