నరసరావుపేట: కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తగదు
రిలే దీక్షలు నిర్వహిస్తున్న నరసరావుపేట మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎం నాయకులు డిమాండ్ చేశారు. గత 18రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నరసరావుపేట మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా ఆదివారం దీక్షా శిబిరంలో వారు పాల్గొన్నారు. కార్మికులపై కక్ష సాధింపు విధానాలు మానుకొని తొలగించిన కార్మికులను విధుల్లో చేర్చుకోవాలి, పని భద్రత కల్పించాలని, నిలిపివేసిన జీతాలు వెంటనే ఇవ్వాలని అన్నారు.